మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కి ముఖ్యమంత్రి గండం వచ్చిపడింది. త్వరలోనే ఉద్దవ్ ఠాక్రే సీఎం పోస్ట్ ఊడిపోవడానికి అవకాశం ఉన్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. మహారాష్ట్ర శాసనమండలిలో ఎలాంటి సభ్యత్వం లేకుండానే ముఖ్యమంత్రిగా ఠాక్రే ఎన్నికయ్యారు. కాగా 6 నెలలలోపు ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీగా గాని  ఈ తరుణంలో అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. మే 28 నాటికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆరు నెలలు పూర్తి కానుంది. ఆలోపు ఉద్దవ్ ఠాక్రే ఏదో ఒక పదవి నుండి కచ్చితంగా ఎన్నిక కావాలి.

 

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఉద్దవ్ ఠాక్రే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే చాన్స్ లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న  పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఎవరైనా రాజీనామా చేసిన ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ అనే మహమ్మారి వైరస్ దేశం లో అన్ని రాష్ట్రలో కంటే మహారాష్ట్ర లో ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ కూడా రెడీగా లేదు. ఇక ఉద్దవ్ ఠాక్రే కి మిగిలి ఉన్న ఆప్షన్ ఎమ్మెల్సీగా ఎన్నికవడం. అయితే ఒక ముఖ్యమంత్రిగా ఉండి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా పదవి పొందటం నైతికం కాదని ఉద్దవ్ ఠాక్రే అనుకుంటున్నారట.

 

దీంతో ఇటీవల ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశానికి కూడా హాజరు కాలేదట. అంతేకాకుండా ఈ సమావేశానికి మైనారిటీ వ్యవహారాల శాఖామంత్రి నవాబ్ మాలిక్ స్వయంగా ఉద్దవ్ ఠాక్రే నీ రావొద్దని సూచించారట. మొత్తం మీద ఈ పరిణామంతో ఉద్దవ్ ఠాక్రే సీఎం పోస్టు ఊడిపోవడానికి రెడీగా ఉన్నట్లు మహారాష్ట్ర రాజకీయాల నుండి  వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ కట్టడి చేయడంలో సీఎం గా విఫలమైనట్లు అందరూ గుర్తించడంతో ఉద్దవ్ ఠాక్రే సీఎం పోస్టు ఊడిపోవడం గ్యారంటీ అని చాలామంది అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: