కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినప్పటి నుండి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో అవలంబిస్తున్న పనితీరుపై హైదరాబాద్ క్వారంటైన్‌లో ఉండి అనేక విమర్శలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ వైసీపీ నేతలు ఎక్కడ హైదరాబాదులో ఉండి మాట్లాడటం కాదు వచ్చి రాష్ట్రంలో చూడాలని చాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల నుండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెడితే 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని అధికార పార్టీ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

 

దానికి చంద్రబాబు సిద్ధమేనా అని ఇటీవల మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. అయితే ఇదే టైములో మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ నగరంలో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. తర్వాత సురేష్ నేరుగా రాష్ట్రానికి వెళ్లిన క్వారంటైన్‌లో లేకుండా పర్యటించారు. ఇటువంటి నేపథ్యంలో టిడిపి నేతలు ప్రతిపక్ష నేత కి ఒక రూల్… ప్రభుత్వ మంత్రికి మరొక రూలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే చంద్రబాబు రాష్ట్ర పర్యటనకు సిద్ధంగా ఉన్నారని మీరు చేసిన ఛాలెంజ్ కి టిడిపి సిద్ధంగా ఉందని.. ప్రతి సవాలు విసిరారు.

 

అయితే ముందుగా సురేష్ ని క్వారంటైన్‌లో ఉంచాక తర్వాత చంద్రబాబు.. రాష్ట్రంలో పర్యటిస్తారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. దీనికి వైసిపి సిద్ధమైతే మేము రెడీ, స్టార్ట్ అవుతామని టిడిపి నేతలు అంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబుతో పాటు అనేకమంది రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్లు కూడా రాష్ట్రానికి రెడీగా రావడానికి ఉన్నారు అంటూ టిడిపి నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం క్వారంటైన్‌ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే గౌరవకరంగా ఉంటుందని టిడిపి నేతలు సూచిస్తున్నారు. ఇతరులకు ఒక రూల్స్, ప్రత్యర్థులకు మరో రూల్స్ ఇలాంటి వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ చేస్తే ప్రజలే నష్టపోతారు అంటూ వైసీపీకి … టీడీపీ నేతలు సూచనలు  ఇస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: