టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారు.ఆయన అక్కడ ఉన్నా ఏపీ రాజకీయాలు సంబంధించి తరచుగా వివాదాస్పద కామెంట్లు చేస్తూ, కాక పుట్టిస్తూ, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. జగన్ పరిపాలన చేతకావడం లేదు అని, అదే తాను ఇప్పుడు ఏపీలో ఉంది ఉంటే మొత్తం కరోనా ని కంట్రోల్ చేసే వాడిని అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వానికి ప్రజలకు సలహాలు ఇవ్వాల్సింది పోయి, చంద్రబాబు ఈ విధంగా రొటీన్ గా రాజకీయ విమర్శలు చేయడం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏపీ ఇప్పుడు ఎంత కష్ట కాలంలో ఉందో తెలిసిందే. ఈ కష్ట సమయంలో చంద్రబాబు కుటుంబంతో సహా హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడి నుంచే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి నాయకులు చంద్రబాబు విమర్శలకు దీటుగా సమాధానం ఇస్తున్నారు.

IHG

ఈ మేరకు ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం కరోనాను కట్టడి చేసే  విషయంలో అన్ని రకాల చర్యలను కఠినంగా తీసుకుంటోంది అని చెప్పుకొచ్చారు. తెలంగాణ నుంచి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ లో పెట్టి అప్పుడు మాత్రమే  విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మోపిదేవి మండిపడ్డారు. అసలు చంద్రబాబు కరోనాకు భయపడకుండా ఏపీ కి రావాలని మోపిదేవి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఏపీకి రావాలంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ఆ తర్వాత ఏపీలో విధించిన నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటన్ లో ఉండి తీరాలని మోపిదేవి క్లారిటీ ఇచ్చారు. 

 

తాము రూల్స్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని, చంద్రబాబు నాయుడిని అయినా వదలకుండా క్వారంటైన్ కి తరలిస్తామని మోపిదేవి చెప్పుకోవచ్చారు. వైసిపి వ్యవహారాన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు ను ఇప్పుడప్పడే ఏపీకి రాకుండా వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టడి చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మోపిదేవి వ్యాఖ్యలపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో, ఇప్పట్లో ఏపీకి వచ్చే సాహసం చేస్తారో లేక మరికొంత కాలం హైదరాబాద్ లోనే మకాం వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: