నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా ఉన్నారు. ఆయన అంతకంటే ఎక్కువగా ప్రజలా మనస్సులు చదివేసిన మానసిక  శాస్త్రవేత్తలా కనిపిస్తారు. చిన్న పిల్లలకు ఇష్టం లేని పనిని గోముగా, ముద్దుగా తల్లి మారింతలు, గిలిగింతలు పెట్టి ఎలా చేయిస్తుందో అలా 130 కోట్ల మంది జనాలను తనదైన మాటలతో మెస్మరైజ్ చేసే సత్తా మోడీ మాస్టార్ సొంతమని చెప్పాలి.

 

ఇక ఇప్పటివరకూ చూసుకుంటే రెండు మార్లు మీడియా ద్వారా జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగాలు చేశారు. ఇక ముచ్చటాగా మూడవ మారు ఆయన వస్తున్నారు. రేపు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగం చేస్తారని అంటున్నారు. మోడీ ప్రసంగం ఎలా ఉంటుంది. ఆయన ఏం చెబుతారన్నది సర్వ జనాల్లో ఆసక్తిగా మారింది.

 

మోడీ మాస్టార్ ఈసారి కూడా గంభీరంగానే ప్రసంగం మొదలుపెడతారా లేక జనాలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని కొత్త టాస్కులు ఇస్తారా అన్నది అందరిలో అతి పెద్ద చర్చగా ఉంది. మోడీ విషయానికి వస్తే ఆయన జనాలతో నేరుగా మాట్లాడేస్తారు. తాను చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేస్తారు. 

 

ఆ సమయంలో ఆయన మాటలు విన్నవారికి ఆయన ఏం చెప్పినా చేయాలనే అనిపిస్తుంది. ఆ తరువాత బయటకు వచ్చి చూసుకున్నపుడు ఇదే బాధ అనిపిస్తుంది.  ఏది ఏమైనా లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తారన్నది అందరికీ అర్ధమైపోతోంది. దాంతో మోడీ అదే విషయాన్ని జనాలకు చెప్పి సహకరించమంటారని అంటున్నారు. అదే కనుక ప్రకటనగా వస్తే మరో మారు అతి పెద్ద బాంబు జనం నెత్తి మీద పడ్డట్టే అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

ఏది ఏమైనా చదువరులతో పాటు రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారు, దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు అంతా లాక్ డౌన్ కొనసాగుతుందనే భావిస్తున్నారు. అయితే లాక్ డౌన్ వేళ మరిన్న ఆర్ధిక సమస్యలు ప్రబలుతాయన్నది మాత్రం అందరిలోనూ గూడు కట్టుకున్న భయం.

మరింత సమాచారం తెలుసుకోండి: