ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతం అమెరికాలో మన భారతీయుల పరిస్థితి అయితే మరి దీనమైన స్థితిలో ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి అసలు లేదు. ఇక తిందామంటే తిండి లేదు. ప్రస్తుతం అమెరికాలో లక్షల మంది భారతీయ విద్యార్థులు  చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు అక్కడ. ఇక భారతీయులను ఆదుకోవడానికి అక్కడ ఒక్కరు కూడా లేరు. ఇక్కడ పొలాలు అమ్మి మరీ అక్కడికి వెళ్లారు మరి కొందరు.

 


అలాంటి వారంతా ప్రస్తుతం పార్ట్ టైం ఉద్యోగాలతో జీవనం కొనాగిస్తున్నారు. కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. ఇలా అవ్వడంతో చాలామంది ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. కనీసం వారి తల్లిదండ్రులు వాళ్ళకి డబ్బులు పంపించలేని స్థితిలో ఇక్కడ ఉన్నారు. అలా అని కనీసం ఇంటికైనా వద్దామనుకుంటే  రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

 


ఈ విషయాన్ని అక్కడ ఎవరికి చెప్పినా కూడా పరిస్థితి సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇక తినడానికి ఆహారం లేక బంగాళదుంపలను ఉడికించుకొని తినే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా మరోవైపు అమెరికా ఇప్పట్లో సాధారణమైన పరిస్థితి వచ్చేలాగా అసలు సూచనలే లేవు. ఇక ఇప్పటిలో అమెరికా నుంచి ఎయిర్ సర్వీసెస్ కూడా మన దేశానికి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. దీనితో అక్కడ ఉన్న భారతీయులంతా ఏ విధంగా జీవనం కొనసాగించాలో అర్థం కాక తమను ఆదుకోవాలని విన్నపిస్తునారు. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంది అని వారు వాపోతున్నారు. ఏది ఏమైనా కన్న దేశాన్ని వదిలి వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతుండం ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. భారత ప్రభుత్వం వీరి పై కరుణ చూపి స్వదేశాని తిరిగి తీసుక రావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: