ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తున్న తరుణంలో పంజాబ్ లో లాక్ డౌన్ గడువు పెంచాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సూచన ప్రాయంగా తాజాగా ప్రకటించడం జరిగింది. తాజాగా నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంజాబ్ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ...  సెప్టెంబర్ వరకు కరోనా వైరస్ ప్రభావం చాలా ఉంటుందని పలు సంస్థలు అంచనా వేశాయి అని తెలిపారు. ఇందులో 58% ప్రజలపై ఈ ప్రభావం ఉంటుందని సైంటిస్టులు వాళ్ల భావన తెలిపారని ముఖ్యమంత్రి మీడియా ద్వారా తెలిపారు. 

 


ఇక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల ద్వారా పంజాబ్ ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని కొనసాగించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎటువంటి రిస్క్ తీసుకునేది లేదని అని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలియజేసినట్లు అర్థమవుతుంది. అంతేకాదు ఈ విషయాన్ని పలు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు ఢిల్లీలో నిజాముద్దీన్ నుంచి 651 మంది రాష్ట్రానికి వచ్చినట్లు గ్రహించమని వారిలో 636 మంది ఎక్కడ ఉన్నారో కనుగొన్నామని, అయితే మిగతా పదిహేను మంది ఎక్కడ ఉన్నారో అర్థం కావటం లేదు. వారి వివరాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నామని అమరీందర్ సింగ్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.

 


ఇక ఇప్పటి వరకు పంజాబ్ లో 132 పాజిటివ్ కేసులు నమోదవగా, అందులో 11 మంది మృత్యువాత పడినట్లు తెలిపారు. అంతేకాకుండా ఒకరితో ఒకరు కలవడంతో 27 మంది కరోనా వైరస్ కారణంగా ప్రభావితులు అయినట్లు ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో సహా లక్షల మందికి ప్రభుత్వం ద్వారా వారికి ఆహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ఇక వైద్య సేవల పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు.


ప్రస్తుతం మా దగ్గర 60 వేలకు పైగా ఎన్-95 మాస్క్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో 76 ఆపరేషనల్  వెంటిలేటర్లు, ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే 358 వెంటిలేటర్లు వైద్య సదుపాయాల కోసం అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే కరోనా వైరస్ బారిన పడిన వారి అందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: