అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. అమెరికాలో కరోనా మరణాలు 14 వేలకు పైగా చేరువైనాయి. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉంది. అయితే కరోనా కారణంగా నిత్యావసర సరుకులు మరియు వస్తువులు కొరత ఎంతగానో ఎక్కువైంది. ఈ క్రమంలో వస్తువుల వినియోగం చాల పొదుపుగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది .


వివరాలలోకి వెళితే టాయిలెట్‌ పేపర్‌ దాచి ఉంచిందన్న కారణంతో ఓ కొడుకు తల్లిపై చేయిచేసుకున్నాడు. కోపించిన తల్లి కన్నకొడుకు పైనే కేసు వేసింది. అయితే షెర్లీ మిల్లర్‌ అనే మహిళ టాయిలెట్‌ పేపర్లను వృథా చేయనీయకుండా కుటుంబ సభ్యుల నుంచి దాచిపెట్టింది. ఆ విషయాన్నీ గ్రహించిన ఆమె కొడుకు వాదనకు దిగాడు ఈ క్రమంలో కోపించిన కొడుకు ఆమె పై పిడిగుడ్డు ఆమె ముఖం పై కురిపించాడు. కోపించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు వివరణ కూడా ఇచ్చింది అదేంటని నిత్యావసర వస్తువులు బయట దొరకడం కష్టం అవుతున్న తరుణంలో తనకొడుకు అవసరం ఉన్నాలేకున్నా టాయిలెట్ పేపర్ వృధాగా వాడుతున్నాడని తెలిసిన ఆమె టాయిలెట్ పేపర్ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉంచిందని కన్నీరు మున్నీరు అయ్యింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: