విజయవాడలో కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని  పోలీసు కమీషనర్‌ ద్వారకా తిరుమల రావు తెలియజేసారు. పాత రాజేశ్వరి పేటలో  పోలీసు కమీషనర్‌ ద్వారకా తిరుమల రావు పర్యటించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు . అదేవిధంగా అక్కడ పాజిటివ్ కేసులు పెరగకుండా గట్టిగా చర్యలను చేయిపెట్టాలని తెలిపారు.

 

 

నగరంలో నమోదైన 25 పాజిటివ్ కేసులలో 17 కేసులు ఢిల్లీ సమావేశానికి వెళ్లివచ్చిన వారు కాగా నలుగురు విదేశాలనుండి వచ్చిన వారు వీరి ద్వారా ఒకరి పాజిటివ్ వచ్చింది అదేవిధంగా. మిగిలిన ముగ్గురికి లోకల్ ట్రాన్స్మిషన్ ద్వారా సోకిందని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేసారు. రాణిగారి తోట, పాయకాపురం, పాత రాజరాజేశ్వరి పేట, సనత్‌ నగర్‌, బుద్దూస్‌ నగర్‌, భవానీ పురం లను రెడ్ జోన్లుగా ప్రకటించారు అదేవిధంగా వీరు ఉంటున్న అన్ని ఏరియా లను రెడ్ జోన్లుగా ప్రకటించారు. మిగతా ఏరియాలలో మామూలుగానే లాక్ డౌన్ విధించినా రెడ్ జోన్ లలో మాత్రం లాక్ డౌన్ ను కట్టుదిట్టం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: