దేశంలో  ఎక్కడ చూసినా కరోనా కు సంబంధించిన చర్చలే నడుస్తున్నాయి.  ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఎక్కడ వ్వవస్థలు అక్కడే నిశ్శబ్ధంగా ఆగిపోయాయి.  అయితే లాక్ డౌన్ సందర్భంగా క్రైమ్ రేటింగ్ తగ్గిందని పోలీసులు అంటున్నారు.  అక్కడక్కడ కొన్ని కేసులు మాత్రమే నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది.  తాజాగా ఓ దొంగను అరెస్ట్ చేసినందుకు పోలీసుకు.. జడ్జీని క్వారంటైన్ కి తరలించే పరిస్థితి ఏర్పడింది.

 


వివరాల్లోకి వెళితే.. లూథియానాలోని జనక్ పురి గణేశ్ కాలనీకి చెందిన 24 ఏళ్ల యువకుడు మోటార్ బైక్, మొబైల్ ఫోన్ చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు చోరీ చేసిన బైక్ పై వస్తున్న ఆ యువకుడ్ని, చోరీలో అతడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే దొొంగని కోర్టులో హాజరుపర్చగా, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు న్యాయమూర్తి మోనికా చౌహాన్ గుర్తించారు.

 


అయితే దొంగతో పాటు వ్యక్తిని మెడికల్ టెస్ట్ చేయమని కోరారు.. వైద్య పరీక్షకు ముందే మరో వ్యక్తి తప్పించుకోగా, దొంగతనం చేసిన యువకుడికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఇంకేముంది..  అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు మొత్తం 17 మందితో పాటు జడ్జి మోనికా చౌహాన్ సైతం క్వారంటైన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. ఒక్క దొంగ ఇంత మందికి ఎసరు పెటాడని అంటున్నారు. 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: