దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో ఈరోజు 16 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 487కు చేరింది. 


 
ఏపీలో కూడా ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పలు జిల్లాలలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ప్రజలను పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. నిత్యావసర వస్తువులకు కూడా అనుమతించటం లేదు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 133 రెడ్ జోన్లను ప్రకటించింది. ఏపీలో ఈరోజు 16 కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 381కి పెరిగింది. మరోవైపు కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 


 
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం పెట్రోల్ కొనుగోలు చేయాలంటే మాస్క్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ వినియోగించని వారికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎట్టి పరిస్థితులలోను ఇవ్వకూడదని పెట్రోల్ బంకులకు సూచించింది. నిబంధనలు పాటించని పెట్రోల్ బంకులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొంది. ఈరోజు నుంచే ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. 


 
ప్రజలు ఖచ్చితంగా మాస్క్ లు వినియోగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు బయటికి వెళితే మాస్క్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశాయి. మాస్క్ లు ధరించని వారికి పలు రాష్ట్రాలలో జరిమానాలు విధిస్తున్నారు. దేశంలో ఏప్రిల 14 వరకు లాక్ డౌన్ అమలు కానుండగా... మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: