ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా వైరస్ పై తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నా... ఢిల్లీ నుంచి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ మరిన్ని రోజులు పెంచాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. ఇక ఇటు జగన్ కూడా లాక్ డౌన్ పై కేంద్రం బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రెండు కరోనాపై పోరాటం చేసే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలలో ఎవరు పనితీరు  బాగుందనే చర్చ జరుగుతుంది.

 

తెలంగాణలో దాదాపు అందరూ కేసీఆర్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఏపీలో మాత్రం జగన్ పనితీరుపై టీడీపీ, జనసేనతో సహా మిగతా విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెదవి విరుస్తున్నారు. పైగా వీరు సీఎం కేసీఆర్ పనితీరుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో లాక్ డౌన్ నేపథ్యంలో  హైదరాబాద్ లో ఉండిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు , కరోనా వ్యాప్తిపై జగన్ కు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా, లేఖల ద్వారా ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే, కొన్ని సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

 

అయితే ఇలా బాబు హైదరాబాద్ లో ఉండి ప్రశ్నించడాన్ని వైసీపీ నేతలు తప్పు బడుతూ, విమర్శలు చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా టీడీపీ ఉంది కదా, అక్కడ సీఎం కేసీఆర్ కు ఎందుకు సలహాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై తెలుగు తమ్ముళ్ల రీజన్ కూడా గట్టిగానే చెబుతున్నారు. కరోనా వ్యాప్తిపై పోరాటం చేయడంలో, ప్రజల్ని ఆదుకోవడంలో, ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి, పరిస్థితుల్ని వివరిస్తూ, ప్రజలకు జాగ్రత్త చెప్పడంలో కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని అంటున్నారు. కానీ జగన్ అలా చేయడంలో విఫలమయ్యారని, అందుకే చంద్రబాబు...కేసీఆర్ కు సలహాలు ఇవ్వడం కంటే ముందు జగన్ కు సలహాలు ఇస్తున్నారని, పైగా ఏపీ ప్రతిపక్ష నేత కాబట్టి బాధ్యతగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: