రాజకీయం అంటే రాజకీయాలే మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది చౌకబారు రాజకీయం, హుందా రాజకీయం గురించి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి సందర్భంలోనూ చెప్పే మాట తాను 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న గొప్ప నాయకుడుని అని గొప్పగా చెప్పుకుంటారు. అంతేకాదు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశానని, తన కంటే సీనియర్ ఈ దేశంలోనే లేరని చెబుతారు. ఇందులో తప్పు పట్టడానికి పెద్దగా ఏమీ లేకపోయినా.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇప్పటికీ తెలుసుకోకపోవడం పైనే  చంద్రబాబుపై ప్రజలు విమర్శలు పెరగడానికి కారణం అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా  ప్రభావంతో  దేశాలన్నీ అల్లాడుతున్నాయి. ఏపీలోనూ ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి ప్రజలకు సహకరించాల్సింది పోయి పదేపదే రాజకీయ విమర్శలు చేస్తున్నారు.


ప్రస్తుతం చంద్రబాబు తెలంగాణలో అంటే హైదరాబాదులో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పదేపదే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేఖలు రాస్తున్నారు. ప్రధాని, గవర్నర్ ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా లేఖలు సంధిస్తూ, ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందే కలిసికట్టుగా కరోనా ను ఎదుర్కొందామని, రాజకీయాలను పక్కన పెడదాం అని చెప్పిన ఆ తర్వాత రోజు నుంచి రాజకీయాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పుకోవాలి. ప్రస్తుతం పవన్ ఏపీ ప్రభుత్వం పై పెద్దగా రాజకీయ విమర్శలు ఏమి చేయడం లేదు. తరచుగా సూచనలు చేస్తున్నారు. గురువారం పవన్ తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 


ఈ సందర్భంగా రాజకీయాల గురించి తరవాత మాట్లాడుకుందాం అని అప్పటి వరకు ప్రభుత్వానికి సహకరిస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూద్దాం అంటూ.. కరోనా సమయంలోనూ రాజకీయాలు చేయడం తమ విధానం కాదటూ పవన్ హుందాగా స్పందించారు. అయితే ఈ ఈ విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం ఆయన రాజకీయ అనుభవాన్ని, ఆయన హుందాతనాన్ని పలుచన చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: