ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అలాగే దీనికి తోడుగా కరోనాకి బలైన వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో రోజుకి వేల మందిలో చనిపోతున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో వీటి రేటు మరీ ఎక్కువగా ఉంది. దీనిని అదుపు చేయడానికి ట్రంప్ సర్కార్ కి చాలా ఇబ్బందిగా మారింది. దీనికి కారణం అక్కడ రోజు రోజుకి మరణాల రేటు తీవ్రంగా పెరగడమే. దీనితో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.


అయితే ఇప్పుడు ఆ శవాలను పూడ్చడానికి ప్రదేశాలు ఉండట్లేదు. రోజురోజుకి అమాంతంగా శవాలు పెరగడంతో ఏం చేయాలో ఇప్పుడు పరిస్థితి అర్థం అవ్వట్లేదు. దీనితో స్మశానంలో స్థలం లేక ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో లేక పబ్లిక్ పార్కులలో ఈ శవాలను ఖననం చేస్తున్నారు. అయితే అక్కడ పెద్ద పెద్ద గుంతలు తవ్వి అందులో వారిని సామూహికంగా ఖననం చేస్తుంది అమెరికా సర్కార్. అయితే దీనిపై ప్రభుత్వానికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాక ఇంకా దారుణమైన పరిస్థితి ఏమిటంటే న్యూయార్క్ లో రోడ్ల మీదే శవాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా తెలుపుతోంది.

 

రోజురోజుకీ అమెరికాలో మరణాల రేటు పెరగడంతో అక్కడ ప్రభుత్వం ఏమి చేయాలో అర్థం కాక ప్రజలను రోడ్ల మీదకు రాకుండా కఠిన ఆంక్షలు మొదలు పెట్టింది. అలాగే అక్కడ పరిస్థితి ఎంతకు దిగజారింది అంటే ఎవరైనా వృద్ధులు ఆసుపత్రులకు వెళితే వాళ్లని జాయిన్ చేసుకోవట్లేదట. దీనితో చివరికి ఆ వృద్ధులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి అమెరికా దిగజారిందని పరిస్థితులు తెలుస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కరోనా ఎప్పటికీ శాంతిస్తుందో వేచి చూడాలి. నిజానికి అక్కడి దేశాలతో పోలిస్తే భారత దేశం నిజానికి చాల సురక్షితంగా ఉందనే చెప్పవచ్చు. దీనితో ఇప్పుడు వివిధ దేశాల్లో ఉన్న అనేక భారతీయులు మన దేశానికి తిరిగి వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: