ప్రస్తుతం భారత దేశంలో లాక్‌ డౌన్ చాల వరకు అన్ని సంస్థలు మూతపడ్డాయని అందరికి తెలిసిన విషయమే. కాకపోతే కొన్ని నిత్యా అవసరాల కోసం కొన్నిటిని తెరిచి ఉంచారు. లాక్‌ డౌన్ వేళ జనాలకు అత్యవసరమైన అవసరాల్లో నగదు కొంతవరకు అవసరం. ATM లలో డబ్బులు అందుబాటులో ఉండేలా బ్యాంకులు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాయి. కాకపోతే అక్కడక్కడా జనాలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.


ATM ల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి కూడా వారికి ఏర్పడింది. ఇలాంటి వారికి సహాయం అందించేందుకు ఒక వినూత్న ఆలోచన చేసింది sbi బ్యాంకు. అయితే అది కూడా కేవలం మంచిర్యాల, కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రమే అవకాశం అంటోంది sbi సంస్థ. sbi మంచిర్యాల రీజియన్ పరిధిలోని మంచిర్యాల, కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో "క్యాష్ హోమ్ డెలివరీ" సేవలను బ్యాంకు ప్రారంభించింది. అయితే కరోనా వైరస్, లాక్‌డౌన్ ఉండటంతో సీనియర్ సిటిజన్లు, పింఛన్‌ దారులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇలా అనేక రకాలుగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకునేందుకు ఇబ్బంది పడడంతో వారందరిని దృష్టిలో పెట్టుకొని హోమ్ డెలివరీ సేవలు అందిస్తున్నామని sbi బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా మంచిర్యాల రీజియన్‌ లో "క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ: సేవలను అక్కడ ప్రారంభించారు. అయితే నగదు అవసరమైన వారు హెల్ప్ లైన్స్‌ నెంబర్ కు ఫోన్ చేస్తే అకౌంట్ వివరాలు సరి చూసుకొని సంబంధిత బ్రాంచి ద్వారా క్యాష్ హోమ్ డెలివరీ చేస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. లాక్‌ డౌన్ ముగిసేంత వరకు ఈ సేవలు ఇవ్వనున్నారు. 


అయితే ఖాతాదారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మాత్రమే హెల్ప్ డెస్క్ శ్రీనివాస్ 94913 64003, రాజేందర్ 8309397457, వంశీ 9160607006, సురేష్ 7799559900, ప్రదీప్ 9908927629 లను సంప్రదించాలని రీజినల్‌ మేనేజర్ తెలియ చేసారు. మిగితా ఖాతాదారులు తమకు అవసరమైన సమాచారం కోసం హెల్ప్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: