యావత్ ప్రపంచం కరోనా వైరస్ తో చాలా ఇబ్బందులు పడుతోంది. ఎక్కడ చూసినా అందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది. అతి తక్కువ సమయంలోనే 205 దేశాలకు ఈ కరోనా వైరస్ వ్యాపించడం జరిగింది. దీనితో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరణ వైరస్ బారినపడి 90 వేలకు పైగా ప్రజలు మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధానం అమలు తీసుకురావడం జరిగింది.  దీనితో ప్రజలకు రోజు వారి పనులు అసలు లేవనే చెప్పాలి. ఈ పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ కొంతమంది జీవనం కొనసాగిస్తున్నారు. ఇక బాధితుల విషయానికి వస్తే లక్షలలో  ఉన్నారంటే అర్థం చేసుకోండి ఎలా ఉందో.  

 

 

అయితే ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు కూడా మూతపడ్డాయి. దీనితో ఆ కంపెనీస్ లో పనిచేసే కార్మికులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్మికులను ఆదుకునేందుకు సినీ నటులు రాజకీయ నాయకులు వాళ్ళ వంతు సహాయం చేయడానికి ముందడుగు వేస్తున్నారు. అంతే కాకుండా దీని కోసం పలువురు తారలు కేంద్రం సహాయనిధితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి తన వంతు సహాయం చేస్తుంది.

 


ఇక అసలు విషయానికి వస్తే అంజనా దేవి తన మిత్రులతో కలిసి 700 మాస్క్ లు తయారు చేయడం జరిగింది. వాటిని బాధితులకు అందజేయడం జరిగింది. కరోనా  వైరస్ యుద్ధంపై పోరాటానికి తన వంతు సహాయం చేస్తున్నారు. అంతే కాకుండా వయసు సైతం లెక్కచేయకుండా అంజనా దేవి కష్టపడిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎంతమంది ఎన్ని విధాలా సహాయం చేస్తున్న కొంతమంది మాత్రం వారికి ఇష్టమొచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. అలంటి వారు మారేంతవరకు ప్రభుత్వాలు ఎన్ని చేసిన దండగే.

మరింత సమాచారం తెలుసుకోండి: