క‌రోనా మ‌హ‌మ్మారి తెలంగాణ‌లో తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డుతోన్న వేళ తెలంగాణ ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు తీవ్ర నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్ప‌టికే అంద‌రికంటే ముందుగా దేశంలోనే క‌రోనా క‌ట్ట‌డికి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌... ఇప్పుడు మ‌రికొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించాల‌ని ముందుగానే ప్ర‌క‌ట‌న చేశారు. ఇక ఇప్ప‌డున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో లాక్‌డౌన్ మ‌రికొద్ది రోజులు పొడిగించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. 

 

ఇక ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రికొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోనుంది. ఇక శుక్ర‌వారం నుంచి తెలంగాణ‌లో మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి. మాస్క్‌లు ధ‌రించ‌కుండా ఎవ‌రైనా బ‌య‌ట‌కు వ‌స్తే చర్యలు తీసుకుంటారు. జరిమానాలు విధించటంతో పాటు.. కేసులు సైతం నమోదు చేస్తారు. మాస్క్‌ల‌తో పాటు ఉమ్మి వ‌ల్ల కూడా క‌రోనా ఎక్కువుగా వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉండ‌డంతో ఎవ‌రైనా బ‌య‌ట ఉమ్మి వేస్తే వారిపై కేసులు న‌మోదు చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాదు అవ‌స‌రాన్ని బ‌ట్టి వారిని అరెస్టు కూడా చేస్తారు.

 

హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక వ్యక్తి వీధుల్లో ఉమ్మి వేసిన ఉదంతంలో అతనిపై చర్యలు తీసుకోవటంతో పాటు.. కేసు నమోదు చేశారు. ఇక..వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన వ్యక్తిని అయితే ఇదే తప్పు చేసినందుకు కేసు నమోదు తో పాటు.. అరెస్టు చేయటం గమనార్హం. సో తెలంగాణ ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: