కరోనా వైరస్ సోకిన వారు ఎంతగా బాధ పడుతున్నారో సోకని వారు కూడా ఆర్థిక సమస్యలతో అంతే బాధలు పడుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే భారత ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు విధించిందో అప్పటినుండి... పేదవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


నిత్యవసర సరుకులు కనుక్కోవడానికి చేతిలో డబ్బులు లేక వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు అప్పుల అడిగిన ఎవ్వరూ ఇవ్వని పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తన సొంత భార్య వద్దే తన అవసరాల నిమిత్తం రూ. 20 రూపాయలు అడిగాడు. కానీ ఇటువంటి గడ్డు పరిస్థితులలో భర్త అడిగితే రూ. 20 ఇచ్చే స్తోమత కూడా ఆ భార్యకు లేకపోయింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన సదరు భర్త మన బలవన్మరణానికి పాల్పడ్డాడు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలోని ఈదమ్మగుడి ప్రాంతానికి చెందిన  దంపతులు అర్జునయ్య(57), మణెమ్మ స్థానిక మార్కెట్ యార్డులో హమాలీ పని చేస్తూ తమ జీవనాన్ని సాగిస్తుండేవాడు. కానీ ఇటీవల కరోనా దెబ్బకు లాక్ డౌన్ ఆంక్షలు విధించడంతో వీళ్ళిద్దరూ తమ ఉపాధులను కోల్పోయారు. దాంతో వారికి ఉన్న ఆదాయపు వనరులు అదృశ్యమయ్యాయి. చేసేదేమీలేక ఇంతకుముందు దాచి పెట్టుకున్న కాస్తో కూస్తో డబ్బుతో నిత్యావసర సరుకులు కొనుక్కుని తమ ఆకలిని తీర్చుకుంటున్నారు.


అయితే తాజాగా భర్త అర్జునయ్య భార్యని రూ. 20 ఇవ్వమని అడిగితే... ఆమె ఇచ్చేనందుకు నిరాకరించింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన సదరు భర్త ఇంటి నుండి వెళ్ళిపోయి... నాగర్ కర్నూలు జిల్లా శివార్లలోని కేసరి సముద్రం వద్ద ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు వేలాడుతున్న అర్జునయ్య మృతదేహాన్ని గమనించిన స్థానిక కౌన్సిలర్ పోలీసులకు సమాచారం అందించగా... సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని హత్యా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: