క‌రోనా లాక్‌డౌన్లో ప్ర‌పంచ వ్యాప్తంగా దొంగ‌త‌నాలు, దొమ్మీలు, దోపిడీలు జ‌రుగుతున్నాయి. యూర‌ప్‌, అమెరికా, బ్రిట‌న్ లాంటి చోట్ల చాలా మంది ప్ర‌జ‌లు షాపింగ్ మాల్స్‌లోకి దూరేసి దొరికిన‌వి దొరికిన‌ట్టు ప‌ట్టుకుపోతున్నారు. ఇక తెలంగాణ‌లో బ్రాందీ షాపుల్లో సైతం క‌న్నాలు వేసి మందు బాటిల్స్ ప‌ట్టుకుపోతున్నారు. ఇక వ‌ల‌స కార్మికులు త‌మ బాధ‌లు త‌ట్టుకోలేక భీభ‌త్సం క్రియేట్ చేసిన సంఘ‌ట‌న గుజ‌రాత్లోని సూర‌త్‌లో జ‌రిగింది. 

 

గుజ‌రాత్‌లోని సూర‌త్లో వ‌ల‌స కార్మికులు శుక్ర‌వారం రాత్రి భీభ‌త్సం క్రియేట్ చేశారు. వీరు లాక్ డౌన్ కార‌ణంగా ప‌నులు ఆగిపోవ‌డంతో సొంత ప్రాంతాల‌కు వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే వీరు త‌మ ప్రాంతాల‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయ‌లేద‌ని.. యాజ‌మాన్యం వాహనాలకు నిప్పు పెట్టారు. డిజైనింగ్‌ పనులు చేసే మంచాలను కూడా తగులబెట్టారు. ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌డంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని అదుపు చేశారు.

 

ఇక గుజ‌రాత్‌లో క‌రోనా కేసులు 100కు పైగా న‌మోదు కావ‌డం... ఆ మ‌ర‌స‌టి రోజే ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్ వ‌ల్ల ప‌నులు లేక‌, తిండి దొర‌క‌క విల‌విల్లాడుతోన్నా త‌మ‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ‌ల‌స కార్మికులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌ను సొంత ఊళ్లకైనా పంపించాలని డిమాండ్‌ చేశారు. కాగా, గుజరాత్‌లో గురువారం ఒక్కరోజే 116 కరోనా కొత్త కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 378కి చేరింది. ఇదే క్రమంలో రెండు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 19కి చేరింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: