కరోనా వైరస్  ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న విషయం తెలిసిందే . ఈ వైరస్ నియంత్రించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ  రోజు రోజుకు ఈ మహమ్మారి  ఎంతో మందిని బలితీసుకుంది. కోరలు చాస్తున్న కరోనా ను కంట్రోల్  చేయడం ఎవరితరం కావడం లేదు. వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా  ఈ వైరస్ కు  సరైన విరుగుడు  కూడా అందుబాటులో లేకపోవడంతో... ప్రస్తుతం చాలా మందికి ఈ వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక కరోనా  వైరస్  ధనిక పేద అనే తేడా లేకుండా సామాన్యుడు సెలబ్రిటీ అనే తారతమ్యం లేకుండా అందరికీ సోకుతూ ప్రాణాలను బలి తీసుకుంటోంది. 

 

 

చాలా మంది సామాన్య ప్రజలతో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వైరస్ బారినపడి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ పేరెత్తితే చాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ను ఊసెత్తితే  చాలు వణికిపోతున్నారు... ప్రాణభయంతో హడలిపోతున్నారు. అయితే హాలీవుడ్ నటి హిల్లరీ హిత్  కరోనా  వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ బారిన పడిన 74 ఏళ్ల హిల్లరీ కరోనా తో   పోరాడలేక మృతి చెందింది. కరోనా వ్యాధితో పోరాడుతున్న హిల్లరీ హిత్ ఆరోగ్య సమస్యలతో మృతి చెందినట్లు హాలీవుడ్ సినీ ప్రముఖులు శనివారం అధికారికంగా ప్రకటించారు. 

 

 

 ఈ విషయాన్ని నటి దత్తత కుమారుడైన అలెక్స్ ఫేస్బుక్ లో  పోస్టు ద్వారా తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా బ్రిటిష్ కి చెందిన హిల్లరీ  ముఖేష్ రివ్స్ చిత్రం  విచ్  ఫైండర్ జనరల్  హాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి నటిగా  పరిచయమైంది హిల్లరీ . ఆ తర్వాత ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. నిర్మాతగా నటిగా హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగించారు. కాగా ఈమే  మృతికి చాలా మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: