దేశంలో రోజు రోజుకీ కరోనా పెరిగిపోతుంది.. ఎక్కడ చూసినా కేసులు సంఖ్య నానాటికీ పెరిగిపోవడంతో భయం గుప్పిట్లో బతకాల్సి వస్తుంది.  సామాజిక దూరాన్ని పాటించాలని నెత్తీ నోరు కొట్టుకుంటూ చెబుతున్నా కొంత మంది నిర్లక్ష్యం వల్ల ఈ కరోనా వ్యాప్తి జరుగుతుంది. రోనా విజృంభణ నేపథ్యంలో ఆ వైరస్‌ను కట్టడి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌, సామాజిక దూరం నిబంధనలను దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హార్‌లో రాజధాని పాట్నాకు సమీపంలోని దిఘా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లో ప్రజలు సామాజిక దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. 

 

ఈ సీన్  చూస్తుంటే అసలు దేశంలో కరోనాని కట్టడి చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. జనాలు గూమికూడకుండా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రజలు ఇలా గుంపులు గుంపులుగా కూరగాయలు కొనడానికి వచ్చారని విమర్శలు వస్తున్నాయి. సాధారణ రోజుల్లో కూరగాయాలు కొనడానికి వచ్చినట్లే ప్రజలు ఈ రోజు ఉదయం అక్కడకు చేరుకున్నారు. దేశంలో ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి.. ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా హెచ్చరిస్తున్నా ఏమాత్రం లెక్క చేయడం.   కనీసం మాస్కులు కూడా ధరించకుండా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బీహార్‌లో ఇప్పటివరకు 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: