కరుణ వైరస్ దేశమంతటా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. సందర్భంగా ప్రధానికి ముఖ్యమంత్రులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించగా నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించడమే మంచిదని వారిలో మెజారిటీ మంది అభిప్రాయపడ్డారు. ఇకపోతే ముందు నుండి లాక్ డౌన్ పై వ్యతిరేక భావం చూపుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రధానికి కొన్ని సూచనలు ఇచ్చారు.

 

జగన్ మోడీ తో మాట్లాడుతూ మీ నాయకత్వ లక్షణాలపై మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పి తమరు సూచించిన వ్యూహంతోనే ముందుకు వెళ్తామని తెలిపారు. అయితే అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకు కదలాలి అన్నది తన అభిప్రాయమని మోదీకి తెలిపిన జగన్ కరోనాతో మనం చాలా సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉందని గుర్తు చేశారు.

 

ఆంధ్రప్రదేశ్ లో 141 కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించామని.. లాక్ డౌన్ ను కొన్ని షరతులతో సడలించాలని సూచించారు. క్లస్టర్లను రెడ్ జోన్ లుగా ప్రకటించి మిగతా ప్రాంతాల్లో సినిమా హాల్స్, మాల్స్, స్కూళ్ళు, ప్రజారవాణా మినహాయించి మిగిలిన వాటిని లాక్ డౌన్ లోనే ఉంచాలని చెప్పారు.

 

రాష్ట్రంలో 1.4 కోట్లకు పైగా ఉన్న కుటుంబాలను - వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నామని - కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి - వారికి వైద్యం అందిస్తున్నామన్నారు. అలాగే దాదాపు 30 వేల మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు

 

అయితే విషయమై మోదీ రాష్ట్ర ప్రభుత్వానికే తమ ఛాయిస్ ను వదిలేస్తారా లేకపోతే దేశమంతా కచ్చితంగా లాక్ డౌన్ పూర్తి స్థాయిలో పాటించాల్సిందేనని చెబుతారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: