రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవి కోల్పోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని ఐదు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలకు తగ్గించారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా ఓకే చేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆటోమేటిక్ గా తన పదవిని కోల్పోయారు. పదవి లో అడుగు పెట్టి 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండటంతో కొత్త నిబంధనల ప్రకారం  నిమ్మగడ్డ పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను తొలగించింది. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కోర్టుకు వెళ్లినా గాని జగన్ కే ఫేవర్ గా పరిస్థితులు ఉండేలా పర్ఫెక్ట్ గా, జగన్ ఈ విషయంలో డీల్ చేశారు అని న్యాయ నిపుణులు అంటున్నారు. మామూలుగా అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు అంత ఈజీ కాదు దానికి పార్లమెంటు ఆమోదం కావాలి అని అప్పట్లో...రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా వేసిన టైములో వార్తలు గట్టిగా వచ్చాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా జగన్ వ్యవహరించారని న్యాయ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వారిని తొలగించాలంటే కచ్చితంగా పార్లమెంటు ఆమోదం కావాలి. ఇప్పట్లో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో రాజ్యాంగం ప్రకారం వెళ్లాలని ప్రభుత్వం భావించింది.

 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కే) ప్రకారం ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీ కాలం, నియామక అర్హతలు, వేతనాలు వంటివి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఖరారు చేయవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ జరగడం కష్టం కాబట్టి ఏపీ ప్రభుత్వం నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇదంతా రాజ్యాంగబద్దమే. కొత్త నిబంధనలు అమలులోనికి రావడంతో నిమ్మగడ్డ రమేష్ తన పదవిని కోల్పోవడం జరిగింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లిన ఒరిగేది ఏమీ లేదని చాలామంది న్యాయ నిపుణులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: