కరోనా పై పోరుకు కేంద్రప్రభుత్వం 15000 కోట్ల ప్యాకేజిని ప్రకటించింది. ఇందులో రూ.7774 కోట్లను తక్షణమే కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం ఉపయోగిస్తారు. మిగతా మొత్తాన్ని 1-4 ఏళ్లలో మీడియం టర్మ్ సపోర్ట్‌గా ఉపయోగిస్తారు. ఈ 15000 కోట్లను కరోనా కట్టడికోసం , టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచడానికి. ఔషదాల కొనుగోలుకు , వైద్య పరికరాల కొనుగోలుకు మరియు కరోనా వైద్య సదుపాయాలను మెరుగు పరచడం కొరకు ముఖ్యంగా ఈ నిధులను వినియోగిస్తారు.

 

కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ అని పిలుస్తున్న ఈ ప్యాకేజీ ని మూడువిడతలుగా అందిస్తారు.ఈ నిధులను రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విభజిస్తారు . అదేవిధంగా covid-19 హాస్పిటళ్ళ ఏర్పాటు మరియు ఐసియు వార్డులలో ఆక్సిజన్ తగినంత నిల్వలను ఉంచడం కోసం ఈ నిధులను వడబోతున్నారు .ఇప్పటికే కేంద్రప్రభుత్వం ప్రజల ప్రయోజనార్ధం రూ.1.7 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగానే గ్రామా మరియు పట్టణ ప్రజలకు మరియు వలస కూలి జనానికి ఈ నిధులను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఫ్రీ రేషన్ మరియు నిత్యావసరాలు ఈ నిధుల ద్వారా అందిస్తున్నారు . లాక్ డౌన్ లో ప్రజలను ఆదుకోవడానికి ఈ నిధులు వాడుతున్నారు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: