క‌రోనాతో అల్ల‌క‌ల్లోలంగా మారిన పాక్‌ను ఆదుకునేందుకు భార‌త్ ముందుకు రావాల‌ని మాజీ క్రికెట‌ర్ షోయాబ్ అక్త‌ర్ వేడుకున్నారు. భారత్‌కు చేతులెత్తి దండం పెడుతున్నా...సాయం చేయండి..షోయబ్ అఖ్తర్ ఓ వీడియోలో వ్యాఖ్య‌నించ‌డం సంచ‌ల‌నంగా మారింది.  క‌రోనా గండం నుంచి  పాకిస్థాన్ బయటపడేందుకు భారత్ పెద్ద మనసుతో ముందుకు రావాలని అక్తర్ అభ్యర్థించాడు.దేశంలో రోజురోజుకు క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోంద‌ని, దాదాపు 10వెంటిలేట‌ర్లు పాకిస్తాన్‌కు అవ‌స‌ర‌మున్నాయ‌ని, భార‌త్ 10వేల వెంటిలేట‌ర్ల‌ను స‌ప్లై చేసి పుణ్యం క‌ట్టుకోవాల‌ని  వేడుకున్నాడు.


 స‌రైన‌న్ని వెంటిలేటర్లు లేకపోవడం వల్ల పాక్ లో మరణాల రేటు ఎక్కువగా ఉందని  వాపోయాడు. ఈ విషయంలో సాయం చేయడానికి విభేదాలను పక్కన పెట్టి భార‌త్ పెద్ద మ‌న‌స్సుతో ముందుకు రావాల‌ని కోరాడు.  ఇదిలా ఉండ‌గా రెండు రోజుల క్రితం క‌రోనా వ్యాధి నియంత్ర‌ణ‌కు నిధుల స‌మీక‌ర‌ణ‌లో భాగంగా భార‌త్‌-పాక్‌ల మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్‌ను నిర్వ‌హించాల‌ని అక్త‌ర్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. దీనిపై భార‌త మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అక్త‌ర్ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న పూర్తిగా త‌ప్పుబ‌ట్టారు. క‌రోనా ఓవైపు విజృంభిస్తేంటే క్రీడాకారుల ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఆట‌లు ఆడించాలా...? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

 అయినా జీవితాల క‌న్నా ఆట‌లేం గొప్ప‌వికావు..అంటూ అక్త‌ర్‌కు చుర‌క‌లంటించారు. ఇదిలా ఉండ‌గా క‌పిల్ వ్యాఖ్య‌లను ప‌ట్టించుకోకుండా పాకిస్థాన్‌కు వైద్య సాయం అంద‌జేయాల‌ని అక్త‌ర్ కోరుతూ వ‌స్తున్నారు. తాజా వీడియోలోనూ అదే విష‌యాన్ని వెల్ల‌డించారు. పాకిస్థాన్‌లో ఇప్ప‌టికే 16వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. రోజురోజుకు వేల‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. పాకిస్థాన్లో అస‌లే ఆర్థిక మాంద్యంతో త‌ల్ల‌డిల్లిపోతున్న ప‌రిస్థితి. టీ, బిస్కెట్ల‌కు కూడా లెక్క‌లు క‌ట్టి ఆ మ‌ధ్య‌లో ప్ర‌భుత్వ ఆఫీసుల్లో నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌ను త‌గ్గించేసుకుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆదేశం క‌రోనాను ఎదుర్కొవ‌డం అంటే మాములు విష‌యం కాదు. పూర్తిగా చైనాపైనే ఆధార‌ప‌డి ఉంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: