ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్టి పీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం కరోనాకు బలైన వారి సంఖ్య ల‌క్ష‌కు పైగా చేరింది. అలాగే క‌రోనా సోకిన వారి సంఖ్య 17ల‌క్ష‌ల‌కు పైగా ఉన్నారంటే ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే కట్టడికి పలు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో కోట్ల మంది ఇళ్లకే పరిమితయ్యారు. అధిక శాతం జీవనోపాధిని సైతం మహమ్మారి చిన్నాభిన్నం చేసింది. అన్ని రంగాలూ స్తంభించిపోవడంతో ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలతున్నాయి. 

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే అంత మంచిది అని ఎప్ప‌టిక‌ప్పుడు అధికారులు చెబుతున్నా కొంద‌రు మాత్రం నిర్ల‌క్ష్యంగా ప్ర‌వర్తిస్తున్నారు. ఇక తాజాగా రిషికేశ్ లో గంగానది ఒడ్డున ప‌ది మంది విదేశీయులు షికార్లు కొడుతున్నారు. వారి దుర‌దృష్టం ఏంటంటే.. అప్పుడే అక్క‌డ‌కు పోలీసులు రావ‌డం.. వీళ్లు పోలీసుల కండ‌బ‌డ‌డం జ‌రిగిపోయింది. దీంతో పోలీసులు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించినందుకు స‌ద‌రు విదేశీయులతో 500 సార్లు సారీ అని రాయించారు. ఆ విదేశీయుల్లో అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇజ్రాయెల్ దేశాలకు చెందివారు. పోలీసులు ప్రశ్నించగా, సరైన కారణాలు చెప్పలేకపోయారు.

 

దీంతో వారి చేత పోలీసులు `నేను లాక్ డౌన్ నిబంధన పాటించలేదు క్షమించండి` అనే వాక్యాలను కాగితంపై ఐదు వందల సార్లు రాయించారు. కాగా, రిషికేశ్ విదేశీయులకు ఓ అంద‌మైన‌ పర్యాటక స్థలంగా పేరుగాంచింది. అయితే కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా దౌత్యకార్యాలయాలు తమ వారిని వెంటనే భారత్ నుంచి తరలించాయి. ఇంకా కొందరు విదేశీయులు రిషికేశ్ లోనే ఉన్నట్టు తాజా ఘటన ద్వారా బ‌య‌ట‌ప‌డింది. దీంతో పోలీసులు క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు.

  

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: