ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు రోజు రోజు కీ తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతుంది.  ఇప్పటికే కరోనా వల్ల కంటిమీద కునుకు లేకుండా పోయింది.  అయితే మన దేశంలో ఎక్కువగా కరోనా విదేశీయుల నుంచి వచ్చిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌ ప్రార్థనలో పాల్గొని వచ్చిన వారికే ఈ కరోనా ఎక్కువగా ప్రభావం చూపించింది. అయితే మర్కజ్‌ ప్రార్థన కు వెళ్లి వచ్చిన వారిని స్వచ్ఛందంగా లొంగిపోయి సరైన వైద్యం అందించుకోవాలని.. అలాంటి వారిని వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లాలని  ఓ వైపు అధికారులు.. మత పెద్దలు చెబుతూనే ఉన్నారు.  

 

కరోనా వైరస్ భూతాన్ని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు తమ శక్తిమేరకు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. కరోనా ఇప్పటికే తన ప్రతాపం చూపిస్తుందని.. లాక్ డౌన్ 14 నుంచి ఈ నెల 31 వరకు పొడిగిస్తే బాగుంటుందని ప్రధాని మోదీకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించిన విషయం తెలిసిందే.  అయితే ఉత్తరాఖండ్  లాక్ డౌన్ విధించినా, కొంతమేర ఆంక్షలు సడలించింది. అది నిత్యావసరాల కొనుగోళ్లు, ఇతర అత్యవసర పనుల కోసం మాత్రమే. కారణం లేకుండా బయట కనిపిస్తే మాత్రం అక్కడి పోలీసులు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు.

 

 

తాజాగా, రిషికేశ్ లో గంగానది ఒడ్డున షికార్లు చేస్తున్న 10 మంది విదేశీయులు పోలీసుల కంటబడ్డారు.  అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇజ్రాయెల్ దేశాలకు చెందినవారున్నారు. అయితే పోలీసులు వారిని  ప్రశ్నించగా, సరైన కారణాలు చెప్పలేకపోవడంతో... "నేను లాక్ డౌన్ నిబంధన పాటించలేదు.... క్షమించండి" అనే వాక్యాలను కాగితంపై ఐదు వందల సార్లు రాయించారు.  స్థానిక సహాయకులు తోడు లేకుండా విదేశీయులు సంచరిస్తే ఊరుకోబోమని, వారికి బస కల్పిస్తున్న హోటళ్లపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: