తెలంగాణ‌లో క‌రోనా లెక్క‌ల‌ను తాజాగా సీఎం కేసీఆర్ శ‌నివారం రాత్రి ప్ర‌క‌టించారు. క‌రోనా కేసులు, లాక్‌డౌన్ ప‌రిస్థితుల‌పై తెలంగాణ కేబినెట్లో సుధీర్ఘంగా చ‌ర్చించారు. ఈ కేబినెట్ ఏకంగా 7 గంట‌ల పాటు సుదీర్ఘంగా జ‌రిగింది. ఇంకా కేసీఆర్ మాట్లాడుతూ మ‌ర్క‌జ్ నిజాముద్దీన్ ఘ‌ట‌న త‌ర్వాత వారి స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌ను ట్రేస్ చేసి ప‌ట్టుకున్నాం.. మ‌ర్క‌జ్‌కు వెళ్లిన వాళ్ల‌ను మొత్తం 1400 వంద‌ల మందిని ప‌ట్టుకుని వారికి, వారి బంధువుల‌కు కూడా ప‌రీక్ష‌లు చేశామ‌ని చెప్పారు.

ఇక రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం గ్రేట‌ర్ ప‌రిధిలో 123 కంటైన్మెంట్ జోన్లు, గ్రేట‌ర్ యేత‌ర ప్రాంతాల్లో 150 కంటైన్మెంట్ జోన్లు గుర్తించామ‌ని చెప్పారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 25, 935 మందిని అన్ని ర‌కాల సుదుపాయాల‌తో క్వారంటైన్‌లో ఉంచ‌గా వారు అంద‌రూ డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపారు. ఇక లేటెస్ట్‌గా పాత‌, కొత్త లెక్క‌లు క‌లిపితే ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిపితే పాజిటివ్ కేసులు తెలంగాణ‌లో 503కు చేరుకున్నాని.. మొత్తం 14 మంది మృతి చెందార‌ని తెలిపారు. ఇక 96 మంది డిశ్చార్జ్ అవ్వ‌గా ప్ర‌స్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 393 మంది ఉన్నాయ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: