దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక్కటే చర్చ.. లాక్ డౌన్‌ ఎత్తేయాలా.. కొనసాగించాలా.. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక్కటే ఉత్కంఠ .. లాక్‌ డౌన్ ఎత్తేస్తారా.. కొనసాగిస్తారా.. వీటితో పాటు లాక్ డౌన్ ఎత్తేస్తే లాభమా.. నష్టమా.. ఈ చర్చ కూడా సాగుతోంది. ఇక ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రధాని మోడీ.. విస్తృత స్థాయిలో మథనం జరుపుతున్నారు. ఎడతెరపి లేకుండా చర్చిస్తున్నారు.

 

 

అయితే ఈ అంశంపై షరతులతో కూడిన లాక్‌ డౌన్‌ ఎత్తివేతను సమర్థిస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఆయన వాదన ఏంటంటే.. జీఎస్‌డీపీలో 35 శాతం, ఉపాధి కల్పనలో 62 శాతం వాటా వ్యవసాయానిదే. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా తగ్గింది. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు నష్టపోతాయి. ఎగుమతులు లేక ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. 90 శాతం పరిశ్రమలు కరోనా ప్రభావంతో మూతపడ్డాయి. రాష్ట్రాలకు ఆదాయం కూడా రాని పరిస్థితి ఉందంటున్నారు జగన్.

 

 

లాక్ డౌన్ కారణంగా సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడింది. వలస, దినసరి కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు.. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు నడవాలి. ప్రజల కనీస అవసరాలకు తగ్గట్టుగానైనా సడలింపు ఇవ్వాలి. మాల్స్‌, సినిమా హాల్స్‌, ప్రార్థనామందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై లాక్‌డౌన్‌ కొనసాగించాలి అంటున్నారు జగన్.

 

ఒక విధంగా చెప్పాలంటే.. నరేంద్ర మోడీ అభిప్రాయాలు, జగన్ అభిప్రాయాలు లాక్‌డౌన్ విషయంలో ఒకేలా ఉన్నాయి. దేశ ప్రజల ప్రాణాలు, దేశ ఆర్థిక వ్యవస్థ రెండింటినీ కాపాడాల్సిన అవసరముందని నరేంద్ర మోదీ, జగన్ ఇద్దరూ అంటున్నారు. రాబోయే 3-4 వారాలు అత్యంత కీలమని ఇద్దరూ చెబుతున్నారు. ప్రజల ప్రాణాలు, దేశ ఆర్దిక వ్యవస్థను రెండిటిని కాపాడుకోవాలని మోడీ, జగన్ ఇద్దరూ అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: