ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ఒకటే చర్చ.. అదే రోజు రోజుకు  విజృంభిస్తే ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా  వైరస్ గురించి. ఎవరి నోట చూసిన  ఇదే మాట వినిపిస్తోంది..భారత్ లో  ఎప్పుడూ వాడివేడిగా జరిగే రాజకీయ విమర్శలు కూడా వినిపించటం లేదు . అధికార ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అందరూ కరోన వైరస్ పోరాటంలో భాగస్వాములు అవుతున్నారు . దేశవ్యాప్తంగా ఎంతగానో సంచలనం సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం బిల్లుకు సంబంధించిన చర్చ కూడా ఎక్కడ రావడం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా  వైరస్ మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పై  చర్చించుకుంటున్నారు.కాగా ఈ నేపథ్యంలోనే  ప్రస్తుతం ఒక అంశం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. 

 


 ఓ ఉగ్రవాదికి  సంబంధించిన వార్త ప్రస్తుతం మరోసారి పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన చర్చకు వచ్చేలా చేసింది. ఇంతకీ ఏం జరిగింది అంటే... కరోనా వైరస్  సందర్భంగా ఓ విచిత్రమైన అంశం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లో 22 ఏళ్ల నుంచి ఓ వ్యక్తి ఉంటున్నాడు. ముజిబుర్ రెహ్మాన్ హత్య చేసి వచ్చినటువంటి  నిందితుడు... అక్కడ హత్య  కేసులో  అరెస్టు కూడా అయ్యి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాక... భారతదేశం బోర్డర్ దాటి ఇక్కడకు వచ్చి పశ్చిమబెంగాల్లో 22 ఏళ్ల నుంచి నివసిస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి బంగ్లాదేశ్ కు  చెందిన వ్యక్తి. ప్రస్తుతం కరోనా  నేపథ్యంలో అందరి వివరాలు సేకరిస్తున్న క్రమంలో విచిత్రమైన ఘటన బయటపడింది. 

 

 దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి  సమాచారం అందించారు. అయితే దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ద్రువీకరిస్తే  అది పెద్ద సంచలనమే  అవుతుంది. లేదా అతని ఏదైనా సైకలాజికల్ గా  తేడా ఉండి  ఇలాంటి సమాచారం అందించాడా అన్నది  మాత్రం తెలియాల్సి ఉంది. కానీ కరోనా  సందర్భంగా బయటపడిన ఈ విచిత్రమైన సంఘటన మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఒక పక్కన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తగ్గుతుంటే ... ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మల్లి  ఆ చర్చకు దారితీస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఈ దేశంలోకి వచ్చి  ఎవరైనా ఎన్నేళ్లయినా ఉండొచ్చు ఏమి చేయరు అన్నటువంటి ధైర్యం.. మన చట్టాల్లో  ఉన్న లోపాల కారణంగానే వచ్చిందన్న దానిపై  ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: