కరోనా ప్రపంచాన్ని అల్లాడిస్తోంది..మానవ తప్పిదం వలన ఈ వైరస్ ఉద్భవించిందా లేక బయో వార్ లో భాగమా అనేది దేవుడికే ఎరుక. ఏది ఏమైనా జరగకూడని నష్టం జరిగిపోయింది. ఇప్పటికే లక్షకి చేరువలో మృతులు ఉన్నారు. లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడి ఆందోళనకి లోనవుతున్నారు. ప్రపంచ దేశాలలో ఎంతో మంది లాక్ డౌన్ కారణంగా ఉపాది లేక ,చేతిలో డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలోనే మాఫియా ఎంట్రీ  ఇచ్చింది...

IHG's needy in a bid to impose ...

చైనా తరువాత కరోనా ప్రభావం చూపించిన దేశం ఇటలీ. ఈ దేశంలో ఇప్పుడు ఆహారా కొరత తీవ్ర స్థాయిలో ఉంది. పరిస్థితులు  అత్యంత దయనీయంగా మారిపోయాయి.దాంతో ఇటలీలో మాఫియా రంగంలోకి దిగింది. ఇటలీలో సామ్రాజ్యాన్ని గడగడ లాడించే మాఫియా కరకు గుండెలని కరోనా కరిగించింది..ఇటలీలో అత్యంత పేద రాష్ట్రాలైన కేంపానియా, సిసిలీ మొదలగు రాష్ట్రాల్లో మాఫియా ఆహారాన్ని పేదలకి అందిస్తోంది...మాఫియా గ్యాంగ్ లుగా ఏర్పడి పేదలకి నిత్యావసర వస్తువులు అందిస్తున్న వీడియోలు కొన్ని బయటపడ్డాయి..అయితే

IHG's struggling residents | World ...

ఈ విషయంపై స్పందించిన ఇటలీ ఇంటిలిజెన్స్ అధికారి ఇది మాఫియా కావాలని చేస్తున్న సాయం. ప్రస్తుత పరిస్థుతులలో పేదలని తమవైపుకి తిప్పుకుని మరిన్ని అరాచకాలు సృష్టించడానికి చేస్తున్న ప్లాన్ అంటూ కొట్టి పడేశారు. ఎంతో మంది ఆయా ప్రాంతాల వారు సూపర్ మార్కెట్ లకి వెళ్లి సరుకులు ఉచితంగా ఇమ్మని బెదిరిస్తున్నారట , బ్యాంక్ ల వద్దకి వెళ్లి డబ్బులు ఇమ్మని డిమాండ్ చేస్తున్నారట. ఈ సంఘటనలు చాలు మాఫియా ఎలా ప్రజలని తమ వైపుకి తిప్పుకుంటుందో చెప్పడానికి అంటున్నారు..ఈ మాఫియాపై దృష్టి పెట్టామని ప్రజలను వారినుంచీ కాపాడుతామని సదరు అధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: