ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించాలని ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే మన దేశంలోనూ గత 20 రోజులుగా లాక్ డౌన్ డౌన్ కొనసాగుతుంది.. ఇంకా ఈ లాక్ డౌన్ ను పొగిడించనున్నట్టు సమాచారం. అయితే ఇది ఇలా కొనసాగుతుండగా ఇప్పటికి కొందరు జనాలు ఈ లాక్ డౌన్ ని అర్థం చేసుకోవడం లేదు. 

 

ఇప్పటికి రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే మన దేశంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య 1069 కు చేరుకుంది. అలాంటి ఈ సమయంలో దేశమంతా లాక్ డౌన్ అమలవుతుండగా ఢిల్లీలోని వసంత విహార్లో నివసిస్తున్న ఒక విదేశీ మహిళ పోలీసుల ముందు లాక్డౌన్ విషయంపై గొడవకు దిగింది.

 

ఉరుగ్వే దౌత్యవేత్త అయిన ఆమె సైక్లింగ్ కోసం బయటకు రాగానే పోలీసులు ఆమెను ఇంట్లోనే ఉండాలి అని అడ్డుకున్నారు.. అంతేకాదు.. ఆమె మాస్కు ధరించకుండా బయటకు వచ్చి పోలీసులు అడ్డుకున్న సమయంలో లాక్ డౌన్ వ్యతిరేకిస్తూ మాట్లాడింది. దేశ పరిస్థితులపై ఎంబీసీకి రోజూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. 

 

దౌత్యవేత్తలను వారి నివాసాలలో ఉండమని విదేశాంగ శాఖ కోరింది. కానీ ఈ మహిళా విదేశాంగ దౌత్యవేత్త లొక్డౌన్ నియమాలను ఉల్లంఘించి గుర్తింపు కార్డు చూపించాలని పోలీసులు ఆ మహిళను కోరిన సమయంలో కార్డును చూపించడానికి నిరాకరించి అతి చేష్టలు చేసింది. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో కేవలం 24 గంటల్లో 166 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: