ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మనదేశంపై పడింది.  ఈ నేపథ్యంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించారు.  అప్పటి నుంచి పేద ప్రజలు, వలస జీవువులు నానా కష్టాలు పడుతున్నారు.  ఓ వైపు ప్రభుత్వాలు పేద ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చూస్తామంటున్నారు.. జరిగే అనర్థాలు మాత్రం జరిగిపోతున్నాయి. ఇక లాక్ డౌన్ సమయంలో నిరాశ్రయులుగా మిగిలిన వారిని ఆదుకునేందుకు న్యూఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో తీవ్ర ఘర్షణ జరిగింది.  అక్కడ చిన్న కారణాల వల్ల జరిగిన గొడవ చిలికి చిలికి గాలి వాన అయ్యింది.  ఇక్కడ ఉంటున్న వలస కార్మికుల మధ్య ఆహారం కోసం జరిగిన గొడవ మరింత పెద్దదై, మొత్తం పునరావాస కేంద్రాన్ని తగులబెట్టేంత వరకూ వెళ్లింది. 

 

తాజాగా పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం.. ఇక్కడ పని చేస్తున్న వారిపై దాడికి దిగిన వలస కార్మికులు, ఆపై దానికి నిప్పంటించారు. పక్కనే ఉన్న యమునా రివర్ లోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. నదిలో దూకిన వారిలో ఒకరు మరణించారు.  అయితే అక్కడ జరిగిన దానికి కారణం ఒకరి పై ఒకరు తప్పులు నెట్టుకుంటూ నిరసనలకు దిగి గొడవ పెద్ద జరిగింది ప్రాణాల పోయే పరిస్థితి ఏర్పడింది.  తమ తోటి కార్మికుని మృతికి షెల్టర్ జోన్ స్టాఫ్ కారణమంటూ, పలువురు నిరసనలకు దిగారు.

 

ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.  పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను తరలించగా, వారిపై రాళ్లు రువ్వారు. షెల్టర్ జోన్ ను తగులబెట్టిన కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. షెల్టర్ జోన్ కు నిప్పంటించిన తరువాత ఆ ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ పునరావాస కేంద్రంలో దాదాపు 250 మంది వరకూ తలదాచుకుని ఉన్నట్టు తెలుస్తోంది. 

 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: