అమెరికాలో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. క‌రోనాతో నిత్యం వేలాది మంది చ‌నిపోతున్నారు. ఒక్క శ‌నివారమే1100మందికి పైగా చ‌నిపోయారు. క‌రోనా మ‌ర‌ణాల్లో అగ్ర‌రాజ్యం ఇటలీని దాటేసింది.  అమెరికాలో కోవిడ్‌–19 విధ్వంసంతో  ఇప్పటి వరకు 18,860 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం క‌రోనా కేసులు  17,16,674 న‌మోద‌వ‌గా, మరణాలు  1,07,637 సంభ‌వించాయి. అలాగే క‌రోనా నుంచి కోలుకున్న వారు 3,95,586 మంది ఉన్నారు. మృతుల్లో అత్యధికులు 60 ఏళ్లకు పై బడిన వారే ఉంటున్న‌ట్లు అమెరికా వైద్య వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. 

 

 న్యూయార్క్‌లో వెయ్యి మందికిపైగా, న్యూజెర్సీలో 400 మందికి పైగా ఇండియన్‌ అమెరికన్లకు వైరస్‌ సోకింది. అమెరికాలో  చ‌నిపోయిన వారిలో 40 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వారు ఉండ‌టం బాధాక‌ర‌మైన విష‌యంం. అమెరికాలో కోవిడ్‌తో కన్నుమూసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఇద్దరు, కేరళకు చెందిన వారు 17 మంది, గుజరాతీయులు 10 మంది, నలుగురు పంజాబీయులు, ఒడిశాకు చెందిన వారు ఒకరు ఉన్నారు.ఇదిలా ఉండ‌గా కోవిడ్‌ బాధితులకు సాయం చేయడానికి ఇప్పటికే పలు ప్రవాస భారతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక యంత్రాంగంతో కలిసి తమ వంతు సాయం అందిస్తున్నాయి. 

 

కరోనా వైరస్‌ భయం మళ్లీ చైనాలో మొదల‌వ‌డం భ‌యాందోళ‌న‌ల‌ను క‌లిగిస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వందలాది మంది చైనీయులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే ఈ ప‌రిణామంతోనే రెండోసారి వైరస్‌ విజృంభిస్తుందనే ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సోకిన కేసులు 1,183కి చేరుకోవడంతో అప్రమత్తంగా ఉండాలని చైనా ప్ర‌భుత్వ వ‌ర్గాలు ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి చైనా మ‌ళ్లీ లాక్‌డౌన్ ఆరంభించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: