అబ్బా.. ఈ వార్తలు రాసే వారు ఉన్నారే! కంఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. అని ప్రస్తుతం జనాలంతా అనుకుంటున్నారు. అవును.. జనాలు అనుకోవడం కాదు కానీ నిజంగానే కొన్నిపత్రికలు లాక్ డౌన్ ఎత్తి వేస్తున్నారు అని రాస్తే.. మరి కొన్ని పత్రికలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు రాశాయి.. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించేకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏడు రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాయి. 

 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించాలని ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇప్పటికే మన దేశంలో 21 రోజులు పాటు లాక్ డౌన్ ప్రకటించగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో మరి కొద్దికాలం పాటు లాక్ డౌన్ పొడిగించాలి అని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. 

 

అయితే ఇప్పటికి కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తుందా? లేదా అనేది తెలియకపోవడంతో కేంద్రంతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయ్. పంజాబ్‌, ఒడిసా రెండు రోజుల క్రితమే లాక్ డౌన్ ప్రకటించగా.. నిన్న రాత్రి తెలంగాణ ఈరోజు  కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ లో కూడా ఈనెల 30 దాకా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. 

 

కాగా లాక్ డౌన్ ఎత్తివేత లేదా పొడిగింపు నిర్ణయాన్ని రాష్ట్రాలకు ఇవ్వొద్దని.. కేంద్ర ప్రభుత్వమే ప్రకటించాలని మెజారిటీ ముఖ్యమంత్రిలు నిన్న శనివారం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ మాట్లాడినప్పుడు కోరారు. ఇంకా ఇప్పుడు మాత్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కేంద్రంతో సంబంధం లేకుండా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయ్. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: