ఈ భూమిమీద పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు.. కానీ ఆ మరణం తెలియకుండా సంభవిస్తే దాని తాలూకూ భయం ఏది మనుషుల్లో ఉండదు.. అయితే ఇప్పుడు పరిస్దితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.. కరోనా వైరస్‌తో కళ్లముందు ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. ఆ చావు ఎవరిని సమీపిస్తుందో అర్ధంకాక కొందరు భయపడుతూ బ్రతుకుతున్నారు.. నిజంగా మృత్యువు కళ్లముందే నివసిస్తుంటే ఎంత ధైర్యం ఉన్నవారు కూడా బెదిరిపోవడం ఖాయం.. కరోనా వైరస్ లేని వారి పరిస్దితే ఇలా ఉంటే.. ఆ వ్యాధి బారినపడిన రోగుల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.. నిత్యం వారు పడే మానసిక సంఘర్షణకు రూపం లేకపోయినా.. అది కంటికి కనిపించని యుద్దమే.. ఇదిగో ఇలాగే ఒక వ్యక్తి కరోనాతో యుద్ధం చేయలేక భయంతో ఈ లోకం నుంచి నిష్క్రమించాడు..

 

 

ప్రస్తుత పరిస్దితుల్లో మృత్యువే తనకు తానుగా వచ్చి దేహీ అంటూ ప్రతి వారిని పలకరిస్తుంది.. ఈ పోరాటంలో గెలిచే వారెవరో, ఓడేవారెవరో ఈ మాయదారి కరోనా అంతమయ్యేదాక తెలియదు.. ఇకపోతే మహారాష్ట్రలో ఒక 30 ఏళ్ల వ్యక్తికి వైద్య పరీక్షలో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా రావడంతో భయాందోళనకు గురై గొంతు కోసుకుని చనిపోయాడు. ఆ వివరాలు చూస్తే.. గత నెలలో అసోం రాష్ట్రం నాగౌన్‌ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన తబ్లిగీ జామాత్‌కు హాజరయ్యాడు. అక్కడి నుండి వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా అతన్ని చికిత్స నిమిత్తం ఈ నెల 7వ తేదీన మహారాష్ట్రలోని అకోలా పట్టణంలో గల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో అతని కుటుంబ సభ్యులు చేర్పించారు..

 

 

ఈ నేపధ్యంలో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా అది పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆస్పత్రి బాత్‌రూంలోకి వెళ్లి గొంతు కోసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన అతన్ని గమనించిన సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆపరేషన్ ధియోటర్‌కు పంపగా సర్జరీ కొనసాగుతుండగానే ఆ వ్యక్తి చనిపోయాడు... మరణాన్ని జయించాలనుకుంటున్న వారు ముందుగా భయాన్ని జయిస్తే చావు దగ్గరికి కూడా రాదు.. ఇదిగో ఇలా భయపడితే చావు కూడా భయపెడుతూనే తీసుకెళ్లుతుంది.. అందుకే కరోనా వచ్చిన వారు ఎట్టి పరిస్దితుల్లో మనో ధైర్యాన్ని కోల్పోకుండా ఈ వైరస్‌తో యుద్ధం చేయండి.. ఏది జరగాలో అదే జరుగుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: