ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య తాండ‌వం చేస్తోంది. ఇప్పుడు చైనా నుంచి అమెరికా వ‌ర‌కు క‌రోనా వైర‌స్‌పై పోరాటం చేయ‌డంలో ఘోరంగా విప‌ల‌మ‌వుతున్నాయి. క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 200కు పైగా దేశాల‌కు విస్త‌రించింది. బాధితులు 19 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతుండ‌గా.. క‌రోనా మ‌ర‌ణాలు ల‌క్ష దాటేశాయి. ఇక అటు చైనాతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల్లాడుతున్నాయి. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారికి మందు కూడా క‌నిపెట్ట‌లేదు. ప్ర‌పంచం అంతా ఏం చేయాల్రా భ‌గ‌వంతుడా ? అని త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న ప‌రిస్థితి.

 

ఇదిలా ఉంటే క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నుగొనేందుకు ప్ర‌పంచంలో ఎన్నో దేశాలు ప్ర‌య‌త్నాలు, ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. అయితే క‌రోనా టీకా ప‌రిశోధ‌న‌లో భార‌త్ దాదాపు స‌క్సెస్ అయ్యింది. దీని ట్రైల్ వెర్ష‌న్ కూడా పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు త్వరలో ఈ టీకా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. భార‌త్ బ‌యోటెక్ క‌రోనా వైర‌స్ పోరాట టీకాను రెడీ చేసింద‌ని.. ఈ సంస్థ చైర్మన్ డాక్టర్ కృష్ణ అల్లా తెలిపారు. 

 

క‌రోనాను ఎదుర్కొని ర‌క్షించ‌గ‌ల సామ‌ర్థ్యం క‌లిగిన తొలి టీకాగా దేశంలోనే ఈ టీకా రికార్డు సాధించింది. ఈ టీకాకు కోరో-వాక్ అని పేరు పెట్టారు. కరోనా వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి ఈ టీకా ముక్కులోకి చొప్పించబడుతుంది. ఈ ఔషధం చాలా ప్రభావవంతంగా ఉంటుంది, ఇది సాధారణ ఫ్లూ ఉన్నప్పటికీ దీనిని ఉపయోగించవచ్చు. ఇది త్వ‌ర‌లోనే ఆమోద ముద్ర వేయించుకుని త్వ‌ర‌లోనే అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: