దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. మన దేశంలో మొదటి కరోనా కేసు కేరళలో నమోదైయింది. అయినప్పటికీ దేశంలో కరోనా బాధితుల సంఖ్య మహారాష్ట్రలో రోజు రోజుకు ఎక్కువగా అవుతున్నాయి. కరోనా మహమ్మారి వలన ఎక్కువ మంది చనిపోయింది మహారాష్ట్రలోనే. 

 

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దేశ రాజధాని ఢిల్లీని వ‌ణికిస్తోంది. శ‌నివారం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు 1069కి చేరాయి. శ‌నివారం ఒక్క‌రోజే 166 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మ‌హారాష్ట్ర త‌ర్వాత పాజిటివ్ కేసులు వెయ్యి మార్కును దాటిన రాష్ట్రంగా నిలిచింది. 

 

ముంబైలోని ధారావిలో కరోనా విజృంభిస్తోంది. ధారావిలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43కి చేరింది. మరోవైపు ఇప్పటికే ఈ మురికివాడకు చెందిన నలుగురు కరోనా సోకి మరణించడంతో ఇప్పుడు ధారావిలో నివసించే 7-8 లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు.

 

ఇప్పటికే 50 మంది ప్రైవేట్ డాక్టర్ల సాయాన్ని కూడా ఈ భారీ ఎక్సర్ సైజ్ లో బీఎంసీ తీసుకుంది. భారత్ లో ఎక్కువగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన విషయం తెలిసిందే. శనివారం మహారాష్ట్రలో కొత్తగా 187 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1761కి చేరుకుంది.

 

దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. లేటెస్ట్ డేటా ప్రకారం... ముంబైలోనే 1,146 కరోనా కేసులు,76మరణాలు నమోదయ్యాయి. ముంబై పొలీసుల సాయంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కంటైన్మెంట్ జోన్ లను గుర్తించింది. ఈ ఏరియాల్లోని ప్రజలు రోడ్లపైకి రాకుూడని,ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. ఈ ఏరియాల్లో జనసంచారాన్ని కంట్రోల్ చేసేందుకు మరిన్ని చర్యలను తీసుకుంటున్నారు.

 

మరోవైపు రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ను ఏప్రిల్-30వరకు పొడిస్తూ సీఎం ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. కరోనా పోరాటంలో ప్రజలందరూ నియమాలను పాటిస్తే ఏప్రిల్-30తర్వాత లాక్ డౌన్ ను పొడిగించాల్సిన అవసరముండదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: