దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను కేంద్రం పొడిగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరికొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించనున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశాయి. 
 
తాజాగా కేరళ సీఎం లాక్ డౌన్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడానికి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్ డౌన్ నిబంధనలను పాటించని వారిపై ప్రకృతి వైపరిత్య చట్టం, ఐపీసీ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే పలు శాఖలకు ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వం 12 రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు, 7 కేంద్ర ప్రభుత్వ శాఖలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. 
 
రాష్ట్రంలో అత్యవసర సేవల్లో ఉన్న ప్రైవేట్ ఉద్యోగులను కూడా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి మినహాయించింది. మిగిలిన వారందరూ లాక్ డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. రైతులకు, రైతుల కూలీలకు కేంద్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దహన సంస్కారాల వంటి కార్యక్రమాలలో 20 మంది కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని సూచించింది. 
 
అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎరువులు, రసాయనాల దుకాణాలు, పండ్ల దుకాణాలు, పాల కేంద్రాలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరచుకోవచ్చని నిబంధనలు విధించింది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: