దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని.. దాన్ని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడిక్కడ స్థంభించిన పోయిన విషయం తెలిసిందే.  అయితే కొంత మంది మాత్రం లాక్ డౌన్ ఏమాత్రం పటించకుండా ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే.  మరోవైపు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.  పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులపై కొందరు  దాడి చేశారు.   పంజాబ్‌లోని లూథియానాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.. 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించి.. కూరగాయల మార్కెట్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై దాడులకు పాల్పడ్డారు దుండగులు... స్థానికులు చేసిన దాడిలో పలువురు పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయి. 

 

కొంత మంది కత్తులతో ఒక పోలీసు అధికారి చేతులు నరకడం కలకలం సృష్టిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై స్థానికుల దాడులకు పాల్పడ్డారు.. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు.. చేతులు తెగిన అధికారికి హూటాహుటిన శస్త్ర చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దాడిలో మరో అధికారి చేతికి గాయమైంది అని పోలీసు అధికారులు చెబుతున్నారు.   ఈ దాడికి పాల్పడిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.   కాగా, పంజాబ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.   

 

ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 151 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశారు.   ప్రజలు సంయమనం పాటించాలని.. ఇది మన ఆరోగ్యం కోసం తీసుకున్న నిర్ణయం అని  కొన్ని రోజులు భరిస్తే కరోనాని కట్టడి చేయవొచ్చని అన్నారు.  నిన్న పీఎం ప్రధాని కాన్పిరెన్స్ మీటింగ్ లో కూడా అందరు సీఎంలు ఇదే మాట్లాడటం విశేషం. కరోనా ని అరికట్టేందుక రెండు వారాలు పొడిగించాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: