ప్రస్తుతం కరోనా ని అరికట్టే నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో చాలా మంది మద్యతరగతి కుటుంబీకులు ఇబ్బందుల  పడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వాలు ఆదుకుంటున్నామని చెబుతున్నారు. కానీ ఇంటి అద్దెల విషయంలో ఎవరు కనికరం చూపించేలా లేరు. అయితే అందరూ అలా ఉండరని.. కొంత మంది తమ మానవత్వం చూపుతున్నారు. సగం అద్దె తీసుకుంటున్నారు.. వాయిదా వేసుకుంటున్నారు.  మరికొంత మంది తమ అద్దె చెల్లించనవసరం లేదని కూడా చెబుతున్నారు. 

 

తాజాగా మానవత్వం ఉన్న వారు కూడా ఉంటారని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన కోడూరి బాలలింగం. కరోనా కష్టకాలంలో తన ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారి  బాధలు గమనించి నెల అద్దె మాఫీ చేసి తన పెద్దమనసు చాటుకున్నారు.  వంద కాదు వెలు కాదు... ఏకంగా  రూ.3.4 లక్షలు. వివరాల్లోకి వెళితే బాలలింగానికి నగరంలో మొత్తం 75 సింగిల్‌ బెడ్‌రూం ఇళ్లున్నాయి.

 

ఈ ఇళ్లలో బీహార్‌ నుంచి వలస వచ్చిన కార్మికులు అద్దెకు ఉంటున్నారు. వీరందరూ ఏప్రిల్‌లో కట్టాల్సిన అద్దె మొత్తాన్ని వద్దని చెప్పేశారు బాలలింగం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా మా ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారెవరూ పనుల్లోకి వెళ్లలేదు. ఆదాయం లేక తిండికే ఇబ్బంది పడుతున్నారు.  వాళ్లు పడుతున్న కష్టాన్ని దగ్గరగా చూశాను.. కన్నీరు వచ్చిందని అన్నారు. పేదల బాధలు నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
punjab policemans hand chopped two others injured

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: