ఏపీలోనూ క్ర‌మ‌క్ర‌మంగా క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 417కు చేరుకుంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో ప‌రిస్థితి కంట్రోల్ తెచ్చేందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌రోనా విష‌యంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే లాక్ డౌన్ అమ‌లు  అవుతోన్న నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు.

 

ఈ మాస్క్‌లు అన్నింటిని వీలైనంత త్వ‌ర‌గా పంపిణీ చేయాల‌ని కూడ ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. కరోనా నివారణా చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 1.43 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. శనివారం రాత్రికి వరకు 32,349 మందిని ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు వైద్యాధికారులకు రిఫర్‌చేశారని..  ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని అధికారులు చెప్పారు. అయితే, వీరేకాకుండా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: