భారత దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి  చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో భారత రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ ఆగిపోయింది. బస్సులు రైళ్ళు విమానాలు అనే తేడా లేకుండా అన్ని రకాల రవాణా వ్యవస్థ పూర్తిగా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. అటు ప్రజలు తమ సొంత వాహనాలను కూడా తీసుకుని రోడ్డు మీదకి రానివ్వడం లేదు పోలీసులు . లాక్ డౌన్  నేపథ్యంలో పెద్దపెద్ద రహదారులు కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి . అయితే ప్రస్తుతం ప్రజలు ఎవరు ఇంటి నుంచి కాలు  బయట పెట్టడం లేదు. 

 

ఇక్కడో  కానిస్టేబుల్  మాత్రం విధి నిర్వహణ కోసం ఏకంగా 460 కిలోమీటర్లు ప్రయాణించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలోనూ ఉద్యోగ ధర్మాన్ని మరువకుండా 460 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి  ఉద్యోగంలో చేరాడు... వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ సమీపంలో బౌటికి చెందిన పాండే  అనే వ్యక్తి... జబల్ పూర్  పోలీస్ స్టేషన్ లో  కానిస్టేబుల్ గా  విధులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన తన భార్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో సెలవులో  ఇంటికి వెళ్ళాడు  పాండే. ఇంటికి వచ్చాక దేశవ్యాప్తంగా లాక్ డౌన్  అమలయ్యింది. దీంతో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోవడంతో ఇంటివద్దే ఇరుక్కుపోయాడు. 

 

 ఈ క్రమంలోనే వెంటనే విధుల్లో హాజరుకావాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ గమ్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి సదుపాయం అందుబాటులో లేదు. ఇక చేసేదేమీ లేక మార్చి 30 తేదీన నడక ప్రారంభించి... మూడు రోజులపాటు నడిచాడు ఆ కానిస్టేబుల్. నడికతోనే  ఎట్టకేలకు జబల్ పూర్  చేరుకొని విధుల్లో చేరాడు. అయితే లాక్ డౌన్  పరిస్థితిలో ఏకంగా 460 కిలోమీటర్లు నడిచి విధులో  చేరడంపై ఇన్స్పెక్టర్ సహా  సిబ్బంది కూడా కానిస్టేబుల్ ను అభినందించారు. ప్రస్తుతం జబల్ పూర్ లోని గంటాఘర్  చౌరస్తా వద్ద విధులు  నిర్వహిస్తున్నాడు పాండే .

మరింత సమాచారం తెలుసుకోండి: