దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశ రాజధాని రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఒక్కసారిగా భూకంపం రావడంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే కొన్ని సెకన్ల పాటు మాత్రమి భూమి కంపించడంతో పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. 
 
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఢిల్లీలో భూకంపం ఇదే తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో కూడా ఢిల్లీ ప్రజలను భూప్రకంపనలు వణికించాయి. భూకంపం రావడంతో మళ్లీ భూకంపం వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోవడంతో ఢిల్లీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భూకంప తీవ్రతకు సంబంధించిన వివరాలు అధికారులు ప్రకటించాల్సి ఉంది. 
 
ఈరోజు సంభవించిన భూప్రకంపనల్లో నగరంలోని కొన్ని భవనాలు ఊగిపోయాయని తెలుస్తోంది. ఢిల్లీతో పాటు ఉత్తరాఖాండ్ లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. అధికారులు భూకంప కేంద్రాన్ని తూర్పు ఢిల్లీలో గుర్తించారు. ఇప్పటికే కరోనా విజృంభిస్తూ ఉండటంతో గజగజా వణుకుతున్న ప్రజలు భూకంపం రావడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. 
 
ఇప్పటికే కరోనా దేశవ్యాప్తంగా వేల సంఖ్య కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 900 కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో ఫలితాలు కరోనాను కట్టడి చేయలేకపోతున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగించనుందని సమాచారం.                                                

మరింత సమాచారం తెలుసుకోండి: