ఒకప్పుడు దూరదర్శన్ లో వార్తలకు ఎంతోప్రాముఖ్యత ఇచ్చే వారు.  ఈ కాలంలో సోషల్ మీడియా ఎన్నో ఛానల్స్ ఉన్నాయి.  కానీ అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేది.. అందులో వచ్చే వార్తలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే వారు.  అప్పట్లో శాంతి స్వరూప్ వార్తలు అంటే ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే వారు.  ఆ తర్వాత పార్వతీ ప్రసాద్ వార్తలు అంటే ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు.  తాజాగా వార్తలు చదవడంలో తనకంటూ ప్రత్యేక శైలిని సంపాదించుకున్న సీనియర్ న్యూస్ రీడర్ పింగళి పార్వతీ ప్రసాద్ కన్నుమూశారు.

 

పార్వతీ ప్రసాద్ మరణం పట్ల ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతీ ప్రసాద్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. పార్వతీ ప్రసాద్ కు భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు.

 

80వ దశకం నుంచే ఆమె ఆలిండియా రేడియో, దూరదర్శన్ వంటి ప్రభుత్వ మాధ్యమాల్లో ప్రముఖ న్యూస్ రీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్ లో ఆమె సేవలు నిరుపమానమని కొనియాడారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: