దాదాపు కొన్ని సంవత్సరాల పోరాటం తో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రం హక్కులతో కూరుకుపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా కానీ ఇచ్చిన మాట విషయంలో కానీ ప్రజా సమస్యల విషయంలో గానీ ఎక్కడా రాజీ పడటం లేదు. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ రావటంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి. అయితే కరోనా వైరస్ విషయంలో వైసీపీ పార్టీలో అందరి నాయకుల కంటే ఎక్కువగా కృషి చేస్తున్న నాయకుడిగా పేర్ని నాని పేరు మారుమ్రోగుతోంది. మామూలుగా అయితే ఇలాంటి విపత్కర ఈ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి పేరు వినపడాలి. ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని.

 

 కానీ ఆళ్ల నాని మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు ముఖ్యమంత్రి సూచనలు మీడియాకు ఇవ్వటంలో మాత్రమే నిమగ్నమయ్యారు. కానీ పేర్ని నాని మాత్రం కరోనా వైరస్ విషయంలో ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడుతూ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలి పోతున్నాడు. పోలీసులను మరియు వైద్యులను సమన్వయం చేసుకుంటూ కరోనా వైరస్ కట్టడి చేయడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు.

 

ముఖ్యంగా సొంత జిల్లా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు నమోదు అయిన సందర్భంలో గ్రామ వాలంటీర్ల తో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పి వార్తల్లో సంచలనంగా నిలిచారు. ఇలాంటి కీలక టైం లో జగన్ కి చాలా అండగా తోపుగాడు గా కరోనా వైరస్ ని ఎదుర్కొన్న నాయకుడిగా పనితనంలో పేర్ని నాని పేరు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గట్టిగా వినబడుతుంది. మామూలుగా అయితే పేర్నినాని సమాచార శాఖ మంత్రి. అయినా గాని కరోనా లాంటి విపత్కర విషయంలో తన శాఖ కాకపోయినా పేర్ని నాని  వైసిపి పార్టీ పరువు నిలబెడుతున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: