జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాటిలో కొన్ని న్యాయస్థానం ఎదుట వచ్చేప్పటికి తుస్సుమన్నయి. ఇంగ్లీష్ మీడియం విషయమే గాని, రాజధాని వ్యవహారమే గాని, లోకల్ ఎన్నికల విషయంలో గాని చాలా వరకూ జగన్ తన వాదన న్యాయస్థానం ముందు బలంగా వినిపించలేదు. దీంతో న్యాయస్థానం విషయంలో చాలావరకు ప్రతిపక్షాలు వేసిన స్కెచ్ లు జగన్ ప్రభుత్వం పై పైచేయి సాధించాయి. ఇటువంటి నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుండి ఇటీవల జగన్ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చి తొలగించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసినదే.

 

ఈ విషయంలో అప్పట్లో జగన్ చాలా సీరియస్ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఆ టైంలో వైఎస్ జగన్... చంద్రబాబు డైరెక్షన్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారని ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా మారాయి. అయితే ఆ తర్వాత ఇటీవల వైఎస్ జగన్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొత్త ఆర్డినెన్స్ ద్వారా పదవీకాలాన్ని తగ్గించి ఆటోమేటిక్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి ఊడిపోయేలా వ్యవహరించడం జరిగింది.

 

అయితే ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానంలో సోమవారం ఈ అంశం కోర్టు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రతిపక్షాలు మరియు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వ్యవహారంలో ఏ విధంగా వాదించిన గాని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నట్టుగా, ఈ విషయం లో హోంవర్క్ చేసి కోర్టులో జగన్ తన మార్క్ స్కెచ్ సరికొత్త వాదన చేయబోతున్నట్లు సమాచారం. కుదిరితే  నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనకాల ఉన్న వాళ్లు కూడా ఇరుక్కునే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: