దేశంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతున్నా.. ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నా.. కరోనా కేసుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1035 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. మరో 40 మంది చనిపోయారు. ఫలితంగా దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,447కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 643 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం 239 మంది చనిపోయారు. దాంతో భారత్‌లో ప్రస్తుతం 6,565 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, గత 48 గంటల్లో దేశంలో ఏకంగా 1,487 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని... ఇందుకోసం లక్ష ఐసొలేషన్ బెడ్లు సిద్ధం చేశామని తెలిపారు.

 

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు. దింతో దేశంలో లాక్ డౌన్ అమలులో ఉండడంతో రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ సంబంధించిన హీరోలు ఇంటికే పరిమితమైయ్యారు. ఇండ్లలోనే ఉంటూ లాక్ డౌన్ నియమ నిబంధలను పాటిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ప్రజలకు కరోనా పైన అవగాహన కల్పిస్తున్నారు.

 

 

అయితే తాజాగా కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సకలం నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సామాన్యుడికైనా, ప్రముఖుడికైనా ఇందులో మార్పు లేదు. దింతో కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సైతం ఇంటికే పరిమితమైయ్యారు. అంతే కాకుండా సెలూన్లు మూసివేయడంతో ఆయన తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తో హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకున్నారు. తన కొడుకు చిరాగ్ పాశ్వాన్ ట్రిమ్మర్ సాయంతో తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ గడ్డాన్ని ఎంతో నేర్పుగా ట్రిమ్ చేయడం ఈ వీడియోలో చూపించారు. కొడుకు ట్రిమ్మింగ్ చేస్తున్నంత సేపు ఓపిగ్గా కూర్చున్న కేంద్రమంత్రివర్యులు ఆపై అద్దంలో తనను తాను చూసుకుని సంతృప్తి వ్యక్తం చేశారుచేశాడు. ఈ వీడియోను చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: