మనిషి కంటే కుక్కకి విశ్వాసం ఎక్కువ అని మరోసారి రుజువయ్యింది. కుక్కకు ఉన్న విశ్వాసం కూడా ఈ రోజులలో మనుషుల్లో లేకుండా అయిపోతుంది. తన యజమానిని పాము కాటు వేసేందుకు ప్రయత్నించడంతో  ఒక కుక్క తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యజమానిని కాపాడింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. 

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా కల్లూర్ మండల కేంద్రంలో కిషోర్ ఆర్ఎంపి డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం సమయంలో కిషోర్ నిద్రిస్తున్నాడు. అప్పుడు గదిలోకి త్రాచు పాము ఇంట్లోకి ప్రవేశించింది. ఈ సంఘటన గమనించిన కుక్క ఇంట్లోకి వెళ్లి పాము పై దాడి చేయడం మొదలుపెట్టింది. దీనితో అక్కడే ఉన్న కిషోర్ పామును కొట్టాడు. దీనితో పాము కిషోర్ పై తిరగబడింది. 

 


అంతే ఇది గమనించిన కుక్క పాము పై దూకి నోటితో గట్టిగా పట్టుకుంది. అయితే ఈ ఘటనలో భాగంగా పాము కుక్కని కాటు వేయడం జరిగింది. అయినా కానీ పామును బయటకు లాక్కొని వచ్చింది కుక్క. ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ కిషోర్ కట్టెతో పామును చంపింది. ఆ తర్వాత ఆ కుక్క (స్నూపీ) ని ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే కుక్క మరణించింది. అయితే చాలా ప్రేమగా పెంచుకున్న కుక్క తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నన్ను కాపాడిందని.. చివరకు కుక్క మాకు మిగలకుండా పోయిందని కుటుంబ సభ్యులంతా బాధలో మునిగిపోయారు. ఏది ఏమైనా సరే కుక్క మాత్రం తన విశ్వాసాన్ని చాటుకుంది అనే చెప్పాలి. అందుకే మీకు పరిస్థితులు అనుకూలిస్తే మాత్రం ముగా జీవాలని పెంచుకోండి. ఒక్కోసారి కన్నవారు, కన్న బిడ్డలు విశ్వసం కోల్పోతారేమో కానీ అవి మాత్రం పెంచినందుకు వాటి జీవితాంతం మానలన్ని గుర్తు ఉంచుకొని విశ్వాసంగా మెలుగుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: