ప్రపంచంలో కరోనా మహమ్మారి చేస్తున్న కరాళ నృత్యం ఏ రకంగా ఉందో అందరికీ తెలిసిందే.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.  చైనా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ తర్వాత అమెరికాలో ఈ కరోనా బీభత్సం సృష్టిస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో వ్యవస్థలన్నీ స్థంభించిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న భారత విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు 2.5 లక్షల మంది భారత విద్యార్థులు అమెరికాలో చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది.   ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి మరీ దుర్భంగా మారింది.. వేల మంది మరణిస్తున్నారు.  లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.

 

యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడడంతో హాస్టళ్ల నుంచి విద్యార్థులు పంపించివేస్తున్నారు. ఈ క్రమంలో 500 మంది భారత విద్యార్థులు భారత దౌత్య కార్యాలయ అధికారులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అమెరికాలో మరణాల సంఖ్య 20 వేలు దాటింది.  అమెరికాలో పరిస్థితులు బాగా లేనందున, ప్రస్తుతం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని సూచించారు. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు.

 

అమెరికాలో మరికొంతకాలం ఉండేలా వీసాలు పొడిగించేందుకు భారత దౌత్య కార్యాలయం సహకరిస్తుందని తెలిపారు. అమెరికాలో భారత రాయబారి తరంజీత్ సింగ్ సంధూ ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో విద్యార్థులతో మాట్లాడారు.కాగా, అమెరికాలోని భారత ప్రధాన దౌత్య కార్యాలయంతో పాటు ఐదు కాన్సులేట్లు కూడా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
punjab policemans hand chopped two others injured

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: