ఈరోజు ఉదయం పంజాబ్ లోని పాటియాలలో కూరగాయల మార్కెట్ వద్ద జరిగిన ఘటన షాక్ కు గురి చేసింది. కరోనా నేపథ్యంలో నేషన్ వైడ్ గా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పంజాబ్ లో కేసులు రోజు రోజు కు ఎక్కువతున్న నేపథ్యంలో  సీఎం అమరీందర్ సింగ్ లాక్ డౌన్ ను ఈనెల 30 వరకు పొడిగించారు. ఇక లాక్ డౌన్ అమలవుతుండగా ఉదయం పాటియాలలో వాహనాలు రాకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా  బారికేడ్లు ను పెట్టారు. అయితే ఈ రోజు ఉదయం ఆ బారికేడ్లను  దూసుకుంటూ ఓ వెహికిల్ వెళ్ళింది. ఆ వెహికిల్ ను పోలీసులు ఆపడం తో అందులో నుండి దిగిన నిహంగ్ గ్యాంగ్ పోలీసులపై దాడికి  దిగింది.
 
ఈఘర్షణ లో ఆ గ్యాంగ్ లోని ఓ వ్యక్తి  కత్తితో  ఏఎస్ఐ చేతిని నరికాడు. చేయి తెగి దూరంగా పడగా అక్కడే వున్న ఓ వ్యక్తి ఆ చేతిని గాయపడ్డ ఏఎస్ఐ కి ఇచ్చాడు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వెంటనే ఏఎస్ఐ ను చండీగఢ్ లోని పీజిఐఏంఈఆర్ హాస్పిటల్ కు తరలించారు. సుమారు 7 గంటల పాటు ఆ ఏఎస్ఐ కి సర్జరీ చేసి తెగిన చేతిని అతికించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘర్షణలో ఏఎస్ఐ తోపాటు మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. 
 
ఇక ఈ ఘటన పై పంజాబ్ సర్కార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్వక్తం చేసింది. దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ను ఆదేశించింది. మరో వైపు ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా గ్యాంగ్ స్టర్ లు గా చెలామణి అవుతున్నారని వారి వాహనం నుండి భారీగా తల్వార్లను స్వాధీనం చేసుకున్నట్లు పాటియాలా సీనియర్ సూపరింటెండ్ అఫ్ పోలీస్ మన్ దీప్ సింగ్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: